టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నేడు (ఆగస్టు 9) 46 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మహేష్ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు మహేష్ బాబుకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహేష్ నమ్రత గారాలపట్టి సితార తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన తండ్రితో దిగినటువంటి ఫోటోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది మహేష్ అభిమానులను ఆకట్టుకుంది. తన తండ్రితో కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..”ప్రపంచానికి మీరు ఒక సూపర్ స్టార్ అయితే మాకు మాత్రం మీరే ప్రపంచం. హ్యాపీ బర్త్ డే నాన్న.. మా ఆటలలో..అల్లరిలో.. నవ్వడం, పాడటం అన్నింటిలోనూ మీరు మాకు బెస్ట్ నాన్నగా ఉన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను లవ్ యు డాడీ “అంటూ సితార తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ నటిస్తున్నటువంటి “సర్కారీ వారి పాట”చిత్రం నుంచి టీజర్ విడుదల చేశారు.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో మహేష్ లుక్స్, స్టైల్ అభిమానులను సందడి చేస్తుందని చెప్పవచ్చు.






























