Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబుకి ఉన్న అభిమానుల గురించి మనకు తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక మహేష్ బాబు సినీ కెరియర్ లో ఆల్ టైం రికార్డ్ గా ఉన్నటువంటి చిత్రాలలో ఒక్కడు సినిమా ఒకటి. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు నటనతో పాటు ప్రకాష్ రాజ్ నటన కూడా అద్భుతమనీ చెప్పాలి.
ఇకపోతే ఇలా ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలను బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కమెడియన్లు స్పూఫ్ చేయడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కమెడియన్స్ చేసే స్పూఫ్ నవ్వు తెప్పించడమే కాకుండా మరి కొన్నిసార్లు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తూ ఉంటాయి.తాజాగా జాతి రత్నాలు కార్యక్రమాలలో భాగంగా నూకరాజు మహేష్ బాబు ఒక్కడు స్పూఫ్ చేశారు.

Mahesh Babu: నూకరాజు పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్…
మహేష్ బాబు చేతితో ముక్కును అనుకోవడం మొన్న క్యాలీఫ్లవర్ లో సంపూర్ణేష్ బాబు నేడు మహేష్ బాబు అనే డైలాగ్ చెప్పడమే కాకుండా.. ఎలాగైనా కబడిలో గెలవాలన్నయ్య అనే డైలాగులను వెటకారంగా చెబుతూ క్లాప్స్ కొట్టారు. ఇలా మహేష్ బాబు సినిమాలు స్పూఫ్ చేస్తూ ఆయనని అవమానించడంతో మహేష్ బాబు అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే నూకరాజు ఇలా చేశారంటూ భారీ స్థాయిలో మహేష్ ఫ్యాన్స్ నూకరాజు పై ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు.































