Super Star Krishna : టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నటుడు మహేష్ బాబు గురించి ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నటువంటి కృష్ణ తన సినీ కెరీర్లో జరిగిన పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులకు తెలియజేయడం కోసం తన కూతురు మంజుల యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తండ్రిని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్ వ్యూలో భాగంగా కృష్ణ తన కెరియర్ లో జరిగిన సంఘటనల గురించి అలాగే తన సినిమా విషయాల గురించి ఎన్నో తెలియజేశారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా మంజుల కృష్ణని ప్రశ్నిస్తూ మహేష్ బాబు హీరోగా పరిచయం చేయడం గురించి ప్రశ్నించారు.ఈ క్రమంలోనే చిన్నప్పుడు మహేష్ బాబుతో జరిగిన ఒక సంఘటన గురించి కృష్ణ ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఒక రోజు ఒక సినిమా షూటింగ్ సమయంలో తనతోపాటు మహేష్ బాబుని కూడా షూటింగ్ కి వెంట తీసుకొని వెళ్ళాను.షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు ఒక మూలన మెట్లపై కూర్చుని గడ్డం కింద చేతులు పెట్టుకుని షూటింగ్ చూస్తున్నాడు. అది చూసి నువ్వు నటిస్తావా అని అడిగాను. నేను చేయను అంటూ బాగా మారాం చేశాడు.

చిన్నప్పుడే పరిగెత్తించాడు..
చేస్తావా చేయవా అంటూ నేను అడిగేసరికి మహేష్ బాబు స్టూడియో మొత్తం పరుగులు తీశాడు. నేను కూడా తన వెంట స్టూడియో మొత్తం పరుగులు పెట్టాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. ఇకపోతే ఆయన మే 31వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవడంతో పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.



































