Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమా కోసం పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి .ఇక ఈ సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో మహేష్ బాబు ఇటీవల కాలంలో బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు.

ఇక మహేష్ బాబు ఈ సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇటీవల తన బావ సుదీర్ బాబు హీరోగా నటించిన హరోం హరా సినిమా ప్రమోషన్లలో భాగంగా తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఇక ఇందులో భాగంగా సుదీర్ బాబు మహేష్ బాబుని పలు ప్రశ్నలు వేశారు.
హరోం హర సినిమాలో ఎక్కువగా గన్స్ ఉపయోగించడంతో యాక్టర్స్‌లో గన్స్‌ను బాగా హ్యాండిల్ చేసిన మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలాంటి ఫేవరెట్ చిత్రం ఏది అని సుధీర్ బాబు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మహేష్ బాబు ఎలాంటి సంకోచం లేకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు అంటూ సమాధానం చెప్పడమే కాకుండా ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా తన ఆల్ టైం ఫేవరెట్ మూవీ అని తెలిపారు.
మోసగాళ్లకు మోసగాడు..
ఈ సినిమాని ఒక వంద సార్లు చూసి ఉంటానని తెలిపారు. ఇక నాన్న నటించిన సినిమాలలో ఈ సినిమా నాకెంతో ఇష్టమని తెలిపారు.. ఇలా మహేష్ బాబు తన తండ్రి నటించిన సినిమాలలో తనకి ఇష్టమైన సినిమా గురించి మాట్లాడటమే కాకుండా ఈ సినిమాని వందసార్లు చూశానని చెప్పడం ఎంతో ఆసక్తికరంగా మారింది.



























