Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సితార ఇంకా టీనేజ్ లోకి అడుగుపెట్టకుండానే సెలబ్రిటీ హోదాలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే సితార ఇప్పటికే ఎన్నో అవకాశాలను అందుకుంటున్న విషయం మనకు తెలిసింది. ఈ క్రమంలోని ఓ నగల సంస్థకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని సమాచారం అయితే తాజాగా అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం అమెరికాలోని టైం స్క్వేర్ పై సితార నగలకు సంబంధించిన యాడ్ ఫోటోలను ప్రదర్శించారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఇక ఈ ఫోటోలను విజువల్స్ నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Mahesh Babu: టైం స్క్వేర్స్ ని వెలిగిస్తున్నావ్…
ఇంత చిన్న వయసులోనే టైం స్క్వేర్ పై సితార ఫోటోలు రావడంతో మహేష్ బాబు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు తన కూతురు సాధించిన ఈ ఘనత గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టైం స్క్వేర్ ని వెలిగిస్తున్నావు…చాలా గర్వంగా ఉంది ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్న అంటూ ఈయన చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Lighting up the Times Square!! ???????????? So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! ???????????? #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023

































