Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి మహేష్ బాబు ఒక్కో సినిమాకు సుమారు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా సినిమాలు మాత్రమే కాకుండా ఈయన ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తూ కూడా భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. మరోవైపు బిజినెస్ రంగంలో కూడా మహేష్ బాబు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు తన వ్యక్తిగత కార్ డ్రైవర్ కోసం ఈయన చెల్లించే రెమ్యూనరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మహేష్ బాబు కేవలం తన వ్యక్తిగత కారు డ్రైవర్ కి నెలకి ఏకంగా 5 లక్షల రూపాయల జీతం చెల్లిస్తారంటూ వార్త వైరల్ అవుతుంది.
సాఫ్ట్ వేర్స్ కూడా పనికిరారుగా…
ఈయన మహేష్ బాబుకి అలాగే నమ్రతకు మాత్రమే వ్యక్తిగత డ్రైవర్ గా పని చేస్తారని అందుకే ఈయనకు 5 లక్షల లక్షల జీతం మహేష్ బాబు చెల్లిస్తున్నారంటూ వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు అసలు ఈయన కారు డ్రైవర్ జీతం ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఏమాత్రం పనికిరారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరూ కూడా వారి వ్యక్తిగత టీం కి ఇదే స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందిస్తున్నారని తెలుస్తుంది.



























