Mahesh fans vs Mega fans: అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వివాదాలు మాములే. ఇంతకు ముందు థియేటర్ల వద్ద ఈ అభిమానుల గొడవలు జరిగేవి. ఇపుడు కాలం మారింది, ఇదంతా సోషల్ మీడియా జమానా.. ఇక్కడ వార్ లైనా, ప్రేమలైనా అన్ని నెట్టింట్లోనే. మా హీరో సినిమా అంత హిట్టు ఇంత హిట్టు అంటూ బీరాలు పోయినా మరో హీరో సినిమాకు నెగెటివ్ ప్రచారం కల్పించాలన్నా సోషల్ మీడియానే దిక్కు.

వసూళ్ల గురించి చర్చ… హ్యాష్ టాగ్ లతో రచ్చ….
ఇక ఇటీవల భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో విడుదలైన ఆచార్య సినిమా కొరటాల దర్శకత్వంలో, మెగాస్టార్ చిరు ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కలిసి తొలిసారి నటించారు. ఈ సినిమా పై మెగా అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నా అవన్నీ నిరాశలైపోయాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఘోరంగా విఫలమైంది. మొదటి రోజు కూడా వసూళ్లను అందుకోలేక పోయింది. సినిమా మెగా అభిమానులకే నచ్చలేదు. ఇక గురువారం విడుదలైన సర్కారు వారి పాట సినిమా మంచి టాక్ తో నడుస్తోంది. ఇక సినిమా కలెక్షన్స్ పై చిత్రం యూనిట్ మొదటి రోజు 75 కోట్లు వసూలు చేసిందని ప్రకటించింది.
#SVPFakecollections#SVP Day-2 RTC x roads 1st show gross- 4,24,011 6 theatres (0Fulls)#BheemlaNayak Day-2 RTC X roads 1st show gross- 4,86,815 4 Theatres (1Full)#GoGreenWithSVP https://t.co/oPiIzlYqLB pic.twitter.com/NBrhZwg9gh
— Aravind (@Aravind_1003) May 13, 2022
Since 2003 ????#MegaFamilyRankuMogudu pic.twitter.com/N85TS5E5P4
— Radoo ???? (@Chandan_radoo) May 13, 2022
ఆల్ టైం రికార్డు అంటూ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ షురూ అయింది. మెగా ఫ్యాన్స్ # SVP fake collections అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని వదులుతారా భీమ్లా నాయక్ ఆచార్య కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది అంటూ # Mega Family Ranku Mogudu అంటూ హ్యాష్ టాగ్ ను రీ ట్వీట్ చేస్తున్నారు.
































