ఆధ్యాత్మిక చింతనలో మహేష్ బాబు… త్వరలో హిమాలయాలకు.. !!

0
306

సంక్రాంతికి విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో మంచి ఉత్సాహంలో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఆ సినిమా తరువాత మహేష్, వంశి పైడిపల్లితో ఒక సినిమా చేయాల్సిఉంది. ప్రస్తుతానికి ఆ సినిమా ఆగిపోయిందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. వంశి చెప్పిన కథ నచ్చకపోవడమే దీనికి కారణం అని అంటున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేద్దామనుకున్న మహేష్ ఆశలపై నీల్లు చల్లాడు వంశి పైడిపల్లి. ముందు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి సినిమా ఓకే చేసిన మహేష్ విదేశాలనుంచి రాగానే పూర్తి కథ విన్నడట. ఈ కథ నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టేసాడని సమాచారం. అయితే మరో స్టోరీ కోసం అన్వేషిస్తున్న మహేష్ కొత్త సినిమా మొదలు పెట్టడానికి కొంచెం గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఆధ్యాత్మిక యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడట.

ఇందుకోసం మహేష్ హిమాయలాలనే ఎంచుకున్నాడని సమాచారం. అతి త్వరలో మహేష్ హిమాలయాలను సందర్శించనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తరచూ ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలకు వెళ్తుంటారు. అక్కడకి వెళ్ళిన ప్రతిసారి రజని ఒక బాబాను తరచూ కలుస్తుంటారు. అయితే మహేష్ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో హిమాయలకు వెళ్లాలనుకోవడం హాట్ టాపిక్ అయింది.

మరోపక్క చిరంజీవి 152 వ చిత్రంలో మహేష్ కనిపించనున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నా “ఆచార్య” చిత్రంలో ఒక స్పెషల్ రోల్ లో మహేష్ నటించనున్నాడని సమాచారం.తరువాత డైరెక్టర్ పరశురామ్, ప్రవీణ్ సత్తారులతో సినిమాలు కమిట్ అవ్వనున్నాడనే వార్త ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి మహేష్ ఎవరితో సినిమా కమిట్ అవుతాడో అని అయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here