డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నేడు (సెప్టెంబర్ 28) 55 వ పుట్టినరోజుజరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ సెలబ్రిటీలు పెద్దఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే ఛార్మి విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ బాబు సినీ కెరీర్లో పోకిరి, బిజినెస్ మెన్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ… పుట్టినరోజు శుభాకాంక్షలు సార్.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిజినెస్ సినిమా తరువాత పూరి జగన్నాథ్, మహేష్ బాబు మధ్య మనస్పర్థలు తలెత్తాయని అప్పటి నుంచే వీరి మధ్య మాటలు లేవని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే గతంలో ఒక వేడుకలో భాగంగా పూరిజగన్నాథ్ ను పిలవకపోవడమే కాకుండా, తన గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

అయితే నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయడంతో వీరి మధ్య మనస్పర్థలు తొలగి పోయాయని అభిమానులు భావిస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనగణమన అనే సినిమా తెరకెక్కుతుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి ప్రస్తావన లేకపోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు అందుకు కారణమనే వార్తలు వినిపించాయి.































