తెలుగు సాంప్రదాయ పండగలలో ఒకటిగా పేరుగాంచిన సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కష్టాలు అన్నింటిని పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు పాత సామాన్లు అన్నింటిని కాల్చివేసి కొత్త జీవితానికి స్వాగతం పలికే అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పవచ్చు. ఈ సంక్రాంతి పండుగ రోజు తెలుగు ప్రజలు ఎన్నో రకాల పిండివంటలను చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

వివిధ రకాల పేర్లతో దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగను అన్ని రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటారు.ఈ సృష్టికి మూలాధారం సూర్యుడు కాబట్టి ఈ పండుగ రోజు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అదేవిధంగా రైతులు పండించిన పంటలు ఈ పండుగకు ఇంటికి చేరుకోవడంతో ఈ పండుగను రైతుల పండుగ అని కూడా పిలుస్తారు. రైతులకు కష్టకాలంలో సహాయం చేసిన మూగజీవాలను ప్రత్యేకంగా పూజించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. 14వ తేదీ ఉదయం 8: 30 నుంచి సాయంత్రం 5:54 వరకు మకర సంక్రాంతి పుణ్య కాలం ఉంటుంది. అదేవిధంగా 8:30 నుంచి10:22 గంటల వరకు మకర సంక్రాంతి మహా పుణ్యకాలం ఉంటుంది. ఈ వ్యవధిలో చేసేటటువంటి ఎలాంటి పనులు అయినా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సంవత్సరం పంటలు బాగా పండి మంచి దిగుబడులను పొందుతారని పండితులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here