మేకప్ లేని యాంకర్ అనసూయను ఎప్పుడైనా చూశారా ?

0
226

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనసూయపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు దీటుగానే స్పందిస్తుంటారు.

అనసూయ బుల్లితెరపై లేదా వెండి తెరపై ఎంతో అందంగా కనబడుతూ అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఆమె మేకప్ లేకుండా మనకు కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా అనసూయ మేకప్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మొహంపై మేకప్ లేకుండా తన మొహం పై వచ్చిన మొటిమలు గురించి తెలిపారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ… అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా మొహం పై నాలుగు మొటిమలు వచ్చాయి అయితే ఒక దానిని గిల్లాను. మొటిమలను గిల్లడం మంచిది కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా నా మొహం పై మొటిమలు రావడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.

మొహంపై మొటిమలు రావడానికి కారణం మామిడి పండ్లు తినడం వల్ల వచ్చాయని అనుకుంటున్నాను. అయితే మొటిమలు వస్తాయని మామిడిపండ్లు తినకుండా ఉండలేము. సంవత్సరానికి ఒక్కసారి ఈ సీజన్లో మాత్రమే లభించే మామిడి పండ్లను ఎవరు తినకుండా ఉండలేము కనుక ఏమాత్రం మొహమాట పడకుండా మామిడికాయలను తినండి నేను కూడా మీతోనే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేకప్ లేకుండా అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.