Mamatha Mohandas: మమతా మోహన్ దాస్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో నటిగా, సింగర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె తెలుగులో వెంకటేష్ ఎన్టీఆర్ వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. అయితే తన అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమాలకు దూరమైన ఈమె తిరిగి సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇక మమత మోహన్ దాస్ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు జూన్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె వరస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన రిలేషన్షిప్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను అమెరికాలో ఉన్న సమయంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. అయితే మా రిలేషన్ ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని ఈమె తెలిపారు.జీవితంలో బంధం అనేది ఉండాలని, కానీ ఒత్తిడితో కూడిన బంధాన్ని కోరుకోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా బలవంతమైన తోడు జీవితానికి అవసరం లేదంటూ మమతా మోహన్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒత్తిడితో కూడిన బంధం..
ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించారు. అయితే జీవితంలో ఒక సరైన వ్యక్తి కోసమే తాను కూడా వెతుకుతున్నానని త్వరలోనే ఆ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తాను అంటూ ఈమె వెల్లడించారు. అయితే గతంలో క్యాన్సర్ బారిన పడిన మమత మోహన్ దాస్ ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడి తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.



























