లిక్కర్ షాపుకు హారతి ఇచ్చి పూజ చేసిన మందుబాబులు!

0
80

సాధారణంగా మనం ఉదయం లేవగానే ఆ దేవుడికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాము. కానీ ఓ మహానుభావుడు మాత్రం ఉదయం లేవగానే లిక్కర్ షాప్ కు హారతులిచ్చి పూజ చేశాడు. లిక్కర్ షాప్ కి హారతి ఇవ్వడం అంటే వ్యాపారం బాగా జరగాలని పూజ చేశాడు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అతను మద్యం కొనడానికి వచ్చి ఏకంగా షాప్ కు హారతులిచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.మద్యం తాగడానికి ఇంత హంగామా అవసరం అనుకుంటే అందుకు కూడా ఒక కారణం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ క్రమంలోనే మందు షాపులు కూడా మూతపడ్డాయి. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 27 జిల్లాలలో మందు షాపులు తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలపడంతో మందుబాబుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

ఈ క్రమంలోనే మందు షాపులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మడానికి అనుమతులు తెలపడంతో మందుబాబులు కోడి కూయక ముందే వైన్ షాప్ ముందు బారులు తీరారు. ఈ క్రమంలోనే మధురైలో ఓ వ్యక్తి.. లిక్కర్ షాప్ అలా ఓపెన్ చేయగానే హారతి ఇచ్చి మరీ మందు బాటిళ్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను కొన్న మందు బాటిల్ లను హారతి ముందు పెట్టి దండం పెట్టుకొని ఎంతో సంబరపడిపోయాడు.

ఈ విధంగా మందు కోసం వైన్ షాప్ ముందు ఈ వ్యక్తి చేసిన హంగామా చూసి పలువురు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఈ వ్యక్తి వైన్ షాప్ కి హారతి ఇస్తూ మందు బాటిల్ కు దండం పెడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆస్కార్ అవార్డ్ గెలుపొందిన కూడా ఇంత సంబరపడిరేమో.. అని కొందరు కామెంట్ చేయగా మరికొందరు మందును బాగా మిస్ అయినట్టు ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here