వీడియో వైరల్: ఒకే చెట్టుకు 20 రకాల మామిడి పండ్లు పండించిన రైతు!

0
158

సాధారణంగా ఒక చెట్టుకు ఒకే రకమైన పండ్లు కాయడం మనం చూస్తుంటాము. అది జామపండు అయినా, మామిడి పండు అయినా. అయితే కొన్ని కొన్ని చోట్ల ఒక చెట్టుకు రెండు రకాల మామిడి పండ్లు కాయడం మనం చూస్తుంటాము.కానీ మీరు ఎప్పుడైనా ఒకే మామిడి చెట్టుకు 20 రకాల పండ్లు కాయడం చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని ఓ వ్యక్తి ఈ విధంగా 20 రకాల మామిడి పండ్లను ఒకే చెట్టుకు పండించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

కర్ణాటకలోని శివమొగ్గలో రిటైర్డ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తన ఇంటి పెరట్లో ఈ విధమైన మామిడి చెట్టును పండిస్తున్నారు. ఈ మామిడి చెట్టుకు కేవలం ఒక జాతికి చెందిన మామిడిపండ్లు మాత్రమే కాకుండా ఏకంగా 20 రకాల మామిడి పండ్లను పండించి అందరిని ఆకట్టుకున్నారు. శ్రీనివాస్ రావు ఇంటి ముందు పెరుగుతున్న మామిడి చెట్టుకు బంగినపల్లి, మల్లికా, తోటపురి, రత్నగిరి, ఆల్ఫోన్సా వంటి తదితర 20 రకాల మామిడి పండ్లను పండిస్తున్నారు.

తక్కువ విస్తీర్ణం కలిగిన వ్యవసాయ భూములలో ఈ విధమైనటువంటి పంటలను పండించడం వల్ల రైతులు అధిక లాభాలను పొందవచ్చని ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తెలియజేస్తున్నారు. ఈ విధంగా పంటలు సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. అయితే శ్రీనివాస్ రావు ఇంటి ముందు పండించిన మామిడి చెట్టుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here