మనలో చాలామంది నాగార్జున, కార్తీ కాంబినేషన్లో తెరకెక్కిన ఊపిరి సినిమాను చూసే ఉంటాం. ఆ సినిమాలో ఒక ప్రమాదం వల్ల నాగార్జున వీల్ ఛైర్ కే పరిమితమై ఉంటాడు. ఆ సినిమాలో నాగార్జునలా నిజ జీవితంలో ప్రమాదాల బారిన పడి వీల్ ఛైర్ కే పరిమితమై ఉంటారు. అలా వీల్ ఛైర్ కే పరిమితమైన వాళ్లు ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లాలన్నా అంత సులభం కాదు. అదే విధంగా ఒక వ్యక్తి తన భార్య వీల్ ఛైర్ కే పరిమితం కావడంతో పరిష్కారం కనుక్కోవాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా తన భార్య వీల్ ఛైర్ ను బైక్ గా మార్చేశాడు. 2005 వరకు బాగానే ఉన్న ఆమె అనుకోని ప్రమాదం వల్ల వీల్ ఛైర్ కే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రకృతిని ఎంతో ప్రేమించే ఆమె ఎటూ కదల్లేని స్థితిలో ఇంటికే పరిమితం కావడం అతనిని ఎంతో బాధించింది. ఆమెకు పర్వత ప్రాంతాలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. అయితే వీల్ ఛైర్ లో పర్వత ప్రాంతాలకు వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు.
 
దీంతో ఆమె భర్త అనుకున్నదే తడవుగా రాళ్లు, ఇసుక, మంచు, పర్వతాలలో సైతం నడిచేలా నాలుగు చక్రాల బైక్ ను తయారు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే 15 సంవత్సరాల క్రితం జాక్ నేల్సన్ అనే యూట్యూబ్ స్టార్ భార్య క్యాంబ్రీ గుర్రపు స్వారీ చేసే సమయంలో ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఆ తరువాత నడుము కింది భాగంలో పక్షవాతం రావడంతో ఏళ్ల తరబడి వీల్ చైర్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

2018లో జాక్ ఆమె కోసం ఎలక్ట్రిక్ బైక్ సిద్ధం చేయాలని అనుకొని ఎవరి అవసరం లేకుండా ఆమె ప్రయాణించేలా వీల్ ఛైర్ తో కూడిన బైక్ తయారు చేశాడు. ఆ బైక్ కు అతను రిగ్ అనే పేరు పెట్టాడు. భార్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాక్ గంటకు కేవలం 20 కిల్లోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా బైక్ ను తయారు చేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here