ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను తుపాకీతో బెదిరించి మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకొని దర్జాగా వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను మరో స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు వెంబడించారు. ఓ మూల మలుపు వద్ద కాపు కాసి.. ఆ స్కూటీపై వచ్చిన వారిని ఆపారు. తమ దగ్గర ఉన్న గన్నును పాయింట్ బ్లాక్‌లో పెట్టి బెదిరించారు. వెనుకాల కూర్చున్న వ్యక్తి వారించినా వాళ్లు వినలేదు.
ఇద్దరు భయంతో ఉండగా.. స్కూటీ నడుపుతున్న ఆ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తీసుకొని తాపీగా వెళ్లాడు. కొద్దిగా ముందుకు వెళ్లి తనతో పాటు వచ్చిన వ్యక్తి బైక్ ఎక్కి ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఉన్నా.. ఎవరూ ముందుకు రాలేదు.
#WATCH | Madhya Pradesh: Two bike-borne miscreants snatch chain from a woman in Gwalior, in broad daylight pic.twitter.com/dHnvfp2dr8
— ANI (@ANI) August 26, 2021
కనీసం అతడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేక పోయారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.






























