దేశంలో ప్రతీ రోజు మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఎక్కడో ఒక ప్రదేశం వద్ద జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కర్ఖశంగా వ్యవహరిస్తున్నారు కామాంధులు. అయితే ఓ మహిళ ఓ కామంధుడు పని పట్టింది. ఇలానే ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని పోల్ కు కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే చితకబాదింది.

ఆ ఘటన బిహార్ లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లోని ఖగాడియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. బిహార్ రాష్ట్రంలోని బెల్డార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రి గ్రామంలో మహిళలను ఓ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందులో ఓ మహిళ తనవెంట పడవద్దని ఎన్ని సార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదు.
ఓ రోజు ఆ మహిళ అతడిని పట్టుకొని కరెంట్ స్తంభానికి కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే కర్రతో ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. శరీరం అంతా గాయాలు కావడంతో పెద్ద పెద్ద కేకలు వేశాడు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడకు వచ్చిన గ్రామస్తులు ఆ దృశ్యాలను చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ గ్రామస్తుల నుంచే ఒకరు వచ్చి ఆమెను పక్కకు లాగారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో దీనిపై నెటిజన్లు వివిధ రాకాలుగా స్పందిస్తున్నారు. అతడు చేసిన పనికి ఇదే తగిన బుద్ది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడికి ఈ శిక్ష సరిపోదని.. పోలీసులకు అప్పగించి కఠిన శిక్ష అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.






























