ఇరవైఏళ్ళపాటు జైలు జీవితం.. నిర్దోషిగా బయటకొచ్చిన ఖైదీ..?

0
225

ఇటీవలే వచ్చిన నాంది సినిమా వల్ల అందరికి ఓ విషయం తెలిసిందే.. అదే అండర్ ట్రయిల్ లో ఉన్న ఖైదీ గురించి.. ఒక ఖైదీ దోషి గా నిర్దారణ కాకున్నా జైలు లో ఉంటే ఆ ఖైదీ ని అండర్ ట్రయల్ లో ఉంచుతారు..అది ఎన్ని సంవత్సరాలైనా జైలు లో మగ్గిపోవాల్సిందే.. కోర్ట్ లో అతని పై క్లియర్ తీర్పు వచ్చాక కానీ శిక్ష పడేది లేనిది తెలీదు. ఈ అంశాన్ని నాంది సినిమాలో చాలా క్లియర్ గా చెప్పారు.. అయితే సినిమాలు అంటేనే నిజజీవితాలకు ప్రేరణ లాంటివి. బయట జరిగిన పరిస్థితులను కథగా మలిచి సినిమా గా తెరకెక్కిస్తారు.. సినిమాల్లోని పాత్రలు సినిమాలకు మాత్రమే పరిమితం అంటే తప్పుగా అనుకున్నట్లే..

అచ్చం నాంది సినిమాలో నరేష్ కి జరిగినట్లే ఓ వ్యక్తికి అండర్ ట్రయిల్ లో ఇరవై సంవత్సరాలు గడిపిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పుర్ లో జరిగింది.. ఆ గ్రామానికి చెందిన విష్ణుతివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇరవై ఏళ్ల క్రితం అత్యాచారం కేసు పెట్టింది. ఈ నేరారోపణ కింద 23 ఏళ్ల వయసులో జైలుకి వెళ్లిన ఆ వ్యక్తి సరిగ్గా తన 43 వ ఏటా అంటే ఇరవై సంవత్సరాల తర్వాత నిర్దోషివంటూ తీర్పునిచ్చి నన్ను బయటకు వదిలేశారు.

ఈ ఇరవై ఇళ్లల్లో తాను ఎంత బాధను , క్షోభను అనుభవించాడో చెప్పాడు ఆ వ్యక్తి.. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. నాకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. లాయర్లను పెట్టుకుని పోరాడేంత ఆర్థిక శక్తి కూడా లేదు. ఒక్క తప్పుడు కేసు వల్ల నా జీవితం అంథకారమయింది. ఆ కేసే లేకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకునేవాడిని. భార్యాపిల్లలతో సంతోషంగా ఉండేవాడిని. నా తలరాత ఇలా ఏడ్చింది..‘ అంటూ ఆ వ్యక్తి ఆవేదన చెందారు. 2000వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో విష్ణు తివారీ వయసు 23 ఏళ్లు. తాను తప్పు చేయలేదని, నాకేం తెలియదని అతడు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతడు జైల్లోనే గడిపాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు అతడిని దోషిగా తేల్చింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతడికి జీవిత ఖైదును విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here