Manasantha Nuvve Child Artist : మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి తూనీగా తూనీగా పాటతో అందరిని సందడి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని కలిత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాట ద్వారా ఈ చిన్నారి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఈమె అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించారు.

ఈ విధంగా పలు సినిమాలలో హీరోయిన్ గా సందడి చేసిన ఈమె తాజాగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే నిశ్చితార్ధం జరుపుకున్న ఈమె త్వరలోనే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడబోతోంది. ఈ క్రమంలో వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాల రామాయణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె అనంతరం గణేష్, ప్రేమంటే ఇదేరా మనసంతా నువ్వే వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. అనంతరం 2008లో సవాల్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు యాడ్స్ ద్వారా సుహాని సందడి చేశారు.

హీరోయిన్ గా గుర్తింపు పొందలేదు..
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ బెంగాలీ భాషలో అందరిని మెప్పించిన సుహాని హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయారు. ఇక ఈమె హీరోయిన్ గా స్నేహ గీతం అనే సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీకు దూరంగా ఉన్నటువంటి సుహాని కలిత తాజాగా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిశ్చితార్థం జరుపుకున్న ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.





























