Varalakshmi: కోలీవుడ్ సినీ నటుడు శరత్ కుమార్ వారసురాలు నటి వరలక్ష్మి ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె ముంబైకి చెందిన నికొలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక ఈమె వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో జరిగిందని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సినీ తారలు అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు.

వరలక్ష్మి తన వివాహ కార్యక్రమాలలో భాగంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అందరిని కూడా ప్రత్యేకంగా కలిసి వారికి వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా ఈమె వివాహ రిసెప్షన్ కి హాజరై సందడి చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ వివాహ రిసెప్షన్ కి మంచు లక్ష్మి, సినీనటి రాజకీయ నాయకురాలు రోజా, బాలకృష్ణ, ఎస్ ఎస్ థమన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని. నటుడు సందీప్ కిషన్ వంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
తారల సందడి..
ఇక తమిళనాడు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు సీనియర్ సినీనటి రమ్యకృష్ణ మీనా వంటి వారందరూ కూడా హాజరై సందడి చేశారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వివాహ రిసెప్షన్ వేడుకలు పాల్గొన్నారని తెలుస్తుంది.



























