Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ అవడం కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఎంతో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్న ఈమె ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఇకపోతే మంచు లక్ష్మి ఎంతో ముక్కు సూటితనం కలిగిన వ్యక్తి అని చెప్పాలి. ఏ విషయమైనా నిర్మొహమాటం లేకుండా తనకు తోచిన సమాధానం చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు బాహుబలి సినిమా నచ్చిందా లేక పుష్ప సినిమా బాగా నచ్చిందా అని ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి ఏ మాత్రం ఆలోచించకుండా తనకు బాహుబలి సినిమా నచ్చిందని తెలిపారు.. ఎందుకని ప్రశ్నించడంతో ఇప్పుడు నేను ఈ సమాధానం చెప్తే పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుందని కూడా మంచు లక్ష్మి వెల్లడించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ నాకు నచ్చలేదని ఈమె వెల్లడించారు.
ఐ లవ్ బన్నీ..
ఈ సినిమాలో హీరో క్యారెక్టర్రైజేషన్ తో ప్రాబ్లం ఉంది. అందులో ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం నాకు అసలు నచ్చలేదు. అలాంటి ఒక సూపర్ హీరో అలా చేస్తే.. అది నార్మల్ అవుతుంది. బయట ప్రేక్షకులు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు అల్లు అర్జున్ చేస్తే నేను కూడా చేయొచ్చు అని అనుకుంటారు. ఈ విషయం బాధగా అనిపించిందని తెలిపారు బట్ ఐ లవ్ బన్నీ కానీ తన క్యారెక్టర్ కూడా నచ్చాలని లేదు కదా అంటూ ఈ సందర్భంగా లక్ష్మీ మంచు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.



























