Manchu Manoj: మంచు మనోజ్ మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు అయితే ఇటీవల కాలంలో ఈయన భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ దంపతులకు ఇటీవల కుమార్తె కూడా జన్మించారు. అయితే తన కుమార్తెకు ఎం ఎం పులి అనే నిక్ నేమ్ పెట్టినట్లు మనోజ్ తెలిపారు.

ఇకపోతే తాజాగా తన కుమార్తె బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా తన కుమార్తె పేరును కూడా ఈ సందర్భంగా మనోజ్ రివీల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనోజ్ తన కుమార్తెకు దేవసేన శోభ ఎం ఎం అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ కూడా చేశారు శివయ్య భక్తులమైన మేము ఆయన కుటుంబంలో భాగమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య దేవసేన పేరును తన కుమార్తెకు పెట్టడం జరిగింది అలాగే తన అత్తయ్య దివంగత శోభా నాగిరెడ్డి గారి పేరులో శోభా పేరును తన కుమార్తెకు పెట్టామని తమ అత్తయ్య ఆశీస్సులు తన బిడ్డపై ఉండాలని ఈయన కోరారు.
దేవసేన శోభ ఎం ఎం…
ఇలా తన కుమార్తెకు దేవసేన శోభ ఎం ఎం అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇక తన జీవితంలో ఎంతో అండగా నిలిచిన తన తల్లిదండ్రులకు అలాగే భూమా కుటుంబ సభ్యులతో పాటు తన అక్క మంచు లక్ష్మి అలాగే అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

































