Manchu Manoj: మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా సినిమాలలో నటిస్తూ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి కొన్ని కారణాల వల్ల ప్రణతి రెడ్డికి పెళ్లైన రెండు సంవత్సరాలకి మనోజ్ విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులతో విడిపోయిన మనోజ్ ఒంటరిగా ఉన్నారు అయితే ఈయన భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు.

ఆమె కూడా ఇదివరకే పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత భర్త నుంచి విడిగా ఉంటున్నారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ చివరికి తమ ప్రేమను గెలిపించుకొని పెళ్లి బంధంతో ఒకటయ్యారు. భూమా మౌనిక మనోజ్ గత నెల మూడవ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా భూమా మౌనిక పెళ్లి చేసుకోవడం వల్ల భూమా కుటుంబంతో మనోజ్ కి ఎంతో మంచి ఆప్యాయత ఏర్పడింది.
ఈ క్రమంలోనే నేడు భూమా అఖిలప్రియ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో తన సోదరీ మౌనిక సోషల్ మీడియా వేదికగా తన అక్కతో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అఖిలప్రియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇదే పోస్టును మనోజ్ రీ పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్డే వదినమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Manchu Manoj:ఆప్యాయంగా పిలిచిన మనోజ్…
ఇలా మనోజ్ అఖిల ప్రియను వదినమ్మ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో మంచు అభిమానులు భూమా అభిమానులు ఈ పోస్టును మరింత వైరల్ చేస్తున్నారు.మౌనికను వివాహం చేసుకున్న తర్వాత చాలా తక్కువ సమయంలోనే మనోజ్ కి భూమా ఫ్యామిలీతో ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందనీ తెలుస్తోంది. ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
































