Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.
ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































