Manchu Manoj: మంచు మనోజ్ ఇటీవల హనుమంత్ అనే వ్యక్తికి సోషల్ మీడియా వేదిక ఇచ్చిన మాస్ వార్నింగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఆకతాయిలు వీడియో కాల్ ద్వారా తండ్రి కూతుర్ల రిలేషన్ గురించి కూడా ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి కామెంట్ లు సంచలనంగా మారాయి.

ఇలా ఆకతాయిలు తండ్రి కూతురు అన్నా చెల్లెలు అనే వరుసలు కూడా మరిచిపోయి ఈ విధమైనటువంటి అసభ్యకర కామెంట్లో చేయడం పట్ల ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో పై సినిమా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ చిన్న పిల్లల విషయంలో తల్లితండ్రులందరూ జాగ్రత్తగా ఉండాలని దయచేసి మీ పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకండి అంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా ఈ వీడియో పై మంచు మనోజ్ కూడా స్పందించారు. పిల్లలపై అసభ్యకర కామెంట్లు చేస్తున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను చైల్డ్ సేఫ్టీ పై గత ఏడాది క్రితం తనని సంప్రదించిన ఏమాత్రం స్పందన లేదని తెలిపారు..
అస్సలు వదలను…
ఇప్పుడు ఆయనే చిన్నపిల్లలపై నీచమైన కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా చిన్న పిల్లలపై కామెంట్లు చేయడం చూస్తుంటే ఎంతో అసభ్యకరంగా అసహ్యంగా ఉందని ఈయన తెలిపారు. ఇలా చిన్న పిల్లల పట్ల ఇలాంటి కామెంట్లు చేయడంతో ప్రణీత్ కు తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు. అమ్మతోడు నిన్ను అసలు వదిలిపెట్టను అంటూ మనోజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.



























