Manchu Mohan Babu : నిన్నటి నుండి బాగా వైరల్ అవుతున్న వీడియో అంటే మంచు వారింటి గొడవ. మంచు మనోజ్ మీదకు మంచు విష్ణు గొడవ పడటానికి వెళ్లడం, అక్కడ మోహన్ బాబు వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ల బంధువు అయిన సారధి అనే వ్యక్తి మీద మంచు విష్ణు దౌర్జన్యం చేయడం, ఇవన్నీ మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోలో కనిపించాయి. అయితే ఈ వీడియోను తన తండ్రి మోహన్ బాబు అదేశించిన వెంటనే మనోజ్ ఫేస్ బుక్ నుండి తొలగించాడు. అయితే జరగాల్సిన నష్టం ఆల్రడీ జరిగిపోయాక ఇంకా వీడియో డిలీట్ చేస్తే ఏంటి. కాకపోతే మోహన్ బాబు గారు ఇటీవల ఆయన జన్మదినం సందర్బంగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుల గురించి చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి.

కొడుకుల గురించి నేను చెప్పను…
మోహన్ బాబు గారు తన ఇద్దరు కొడుకుల గురించి చెబుతూ నా కొడుకుల గొప్ప అని నేనే చెప్పకూడదు అంటూనే ఇద్దరి గురించి చెప్పారు. విష్ణు చాలా బాధ్యతగా ఉంటాడు అంటూ చెప్పారు. దాదాపు పదేళ్ళ నుండి తానే విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్స్ గురించి చూసుకుంటున్నాడు అంటూ చెప్పారు. ఇక మనోజ్ సినిమాల మీదే దృష్టి పెట్టాడు. వ్యాపారాల మీద పెద్దగాలేదు.

ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇకపై వ్యాపారాలు చూసుకుంటాడేమో చూడాలి అంటూ చెప్పారు. ప్రస్తుతం మనోజ్ మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నాడు అనే హింట్ మాత్రం ఇచ్చారు మోహన్ బాబు. ఇక కూతురు మంచు లక్ష్మికి సహాయం చేసే గుణం ఎక్కువ అంటూ చెప్పారు. తాను ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటుందని తెలిపారు.