మా ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేనంతగా చిత్ర పరిశ్రమలో కొన్ని అంచనాలు, మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమలో దింవంగత దాసరికి ప్రత్యేక స్థానం ఉంది. అతడు ఎంతో మంది నటీనటులను పరిచయం చేశాడు. తెలుగు పరిశ్రమకు అతడు ఒక పెద్దన్నగా వ్యవహరించాడు. అతడు అకాల మరణం చెందిన తర్వాత సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కులేకుండా పోయింది.

ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మా ఎన్నికల వ్యవహారం కూడా తలో దిక్కుగా మారిపోయింది. అయితే అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? ఆ సమర్థత ఎవరికి ఉంది.. అనే ప్రశ్నలు ప్రతీ ఒక్కరికీ మెదులుతున్నాయి. మా ఎన్నికల తర్వాత మంచు విష్ణు అధ్యక్షుడిగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే దాసరి స్థానాన్ని చాలామంది చిరంజీవి తీసుకోవాలని కోరారు.
కానీ నాగబాబు చాలా సందర్భాల్లో మా అన్నయ్యకు వాటిపై ఆశ లేదు అనే సరికి చిరంజీవి ఫేవర్ వర్గం వెనక్కి తగ్గారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన చిరంజీవి మాత్రమే దాసరి స్థానాన్ని భర్తీ చేయగలడు అనేది వారి అభిప్రాయం. అయితే ప్రస్తుతం మా లో వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల నిర్వహణపై ఒకరిపై ఒకరు దూషించుకుంటూనే ఉన్నారు. మంచు విష్ణును పీఠంపై కూర్చోబెట్టి.. మోహన్ బాబు చక్రం తిప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల టాక్.
దాసరి స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయగలడనేది కొంతమంది సినీ ప్రముఖుల అభిప్రాయం. సినీ నటుడు నరేశ్ కూడా.. పెద్దన్నగా మోహన్ బాబు ఉండాలని ఎన్నో సార్లు చెప్పాడు. దీనిపై మోహన్ బాబు స్పందించలేదు కాని.. అతడి మనస్సులో కూడా అదే ఉందనేది తెలుస్తోంది. ఇటు వైపు అతడి విష్ణు అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి అతడు సినీ పెద్దలను కూడా కలుస్తున్నాడు. దీంతో మోహన్ బాబు తెలుగు సీని ఇండస్ట్రీకి పెదరాయుడు కావాలని అనుకుంటున్నట్లు కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
































