Manchu Vishnu: సినీ నటుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ఒక వీడియోని విడుదల చేస్తూ సోషల్ మీడియా యూట్యూబర్స్ కి తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో వాళ్లు ఫేమస్ అవ్వడం కోసం సెలబ్రిటీల ఫోటోలను అలాగే వారి గురించి ఎంతో వల్గర్ కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నటీనటుల గురించి వారి కుటుంబం గురించి ఎవరైతే ఇలాంటి వల్గర్ వీడియోలు అలాగే చెత్త కామెంట్లు చేస్తూ పోస్టులు చేశారో అలాంటి వారందరూ 48 గంటలలోపు వాటిని డిలీట్ చేయాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ ఈయన వారికి వార్నింగ్ ఇచ్చారు.
ఇకపోతే ఇటీవల యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ విషయంపై కూడా ఈయన స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముందుగా ఈయన పై చర్యలు తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఈ సమస్యను లేవనెత్తిన నటుడు సాయిధరమ్ తేజ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఒక చిన్న పిల్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ఈయన ప్రశ్నించారు.
48 గంటల్లో..
మీ ఇంట్లో కూడా అమ్మ చెల్లి భార్య పిల్లలు ఉంటారు కదా వారిని ఎవరైనా ఇలాగ మాట్లాడితే ఎంత బాధ పడతారో అదే విధంగా ఇతర మహిళల పట్ల కూడా ఇలాంటి అసభ్యకర పదాలు మాట్లాడటం సరికాదని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన నటీనటుల గురించి లేదంటే వారి భార్య పిల్లల గురించి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకర పదాలు పెడుతూ వీడియోలు చేస్తున్నారో అలాంటి వారు వెంటనే డిలీట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విష్ణు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























