Manoj: మంచు కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అందరూ అనుకున్న విధంగానే మనోజ్ భూమా మౌనిక వివాహం శుక్రవారం రాత్రి 8:30కు ఎంతో అంగరంగ వైభవంగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి పెద్దల అంగీకారంతో రెండోసారి పెళ్లి పీటలు ఎక్కి పెళ్లి చేసుకున్నారు.

ఈ విధంగా ఫిలింనగర్ లో ఉన్నటువంటి మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహం ఇద్దరికీ రెండో పెళ్లి కావడం గమనార్హం.2015 వ సంవత్సరంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా పెళ్లైన రెండు సంవత్సరాలకి మనోజ్ తనకు విడాకులు ఇచ్చి తన నుంచి దూరంగా ఉన్నారు.
ఇకపోతే ఇదివరకే మౌనిక రెడ్డికి కూడా బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించిన తర్వాత మౌనిక రెడ్డికి తన భర్తతో మనస్పర్ధలు రావడం చేత తనకు విడాకులు ఇచ్చి ఈమె కూడా తన కుమారుడితో ఒంటరిగా ఉన్నారు.ఇకపోతే గత కొంతకాలంగా భూమా కుటుంబానికి మంచు కుటుంబానికి ఎంతో మంచిది అనుబంధం ఉంది.ఈ క్రమంలోనే మంచు మనోజ్ భూమా మౌనిక మొదటి వివాహానికి ఒక అతిథిలా హాజరయ్యారు.

Manoj: మౌనిక పెళ్లిలో అతిథిలా మెరిసిన మనోజ్..
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా తన పెళ్లికి ఓ అతిథిగా వెళ్ళినటువంటి మనోజ్ ఇప్పుడు అదే అమ్మాయిని తన భార్యగా చేసుకోవడం గమనార్హం. ఇలా భూమా మౌనికతో మొదటి నుంచి తనకు మంచి స్నేహబంధం ఉంది అయితే తనతో ఉన్నటువంటి ఈ స్నేహం ప్రేమగా మారడంతో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మౌనిక మనోజ్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.































