సాధారణంగా ప్రతిరోజు మనం బ్రష్ చేసేటప్పుడు చాలామంది అనేక పొరపాట్లు చేస్తుంటారు.ఫలితంగా ఎన్నో రకాల దంత సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మనం బ్రష్ చేసే విధానం మన దంతాలు చిగుళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కనుక బ్రష్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా బ్రష్ చేసే సమయంలో ఈ క్రింది తెలిపిన పొరపాట్లను అస్సలు చేయకూడదు.

బ్రష్ చేసే సమయంలో చాలా మంది చాలా వేగంగా పళ్ళు తోముతారు. ఈ విధంగా వేగంగా బ్రష్చేయటం వల్ల చిగుళ్లపై అధిక ఒత్తిడి కలిగి చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కనుక బ్రష్ చేసేటప్పుడు వేగంగా చేయకూడదు. అదేవిధంగా ప్రతిరోజు రెండు సార్లు బ్రష్ చేస్తూ కేవలం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయాలి.
మూడు నిమిషాల కన్నా ఎక్కువ సమయం బ్రష్ చేయటం వల్ల దంతాలు దెబ్బతింటాయి. చాలా మంది ఒకే బ్రష్ సంవత్సరాలు తరబడి ఉపయోగిస్తుంటారు. టూత్ బ్రష్ ముల్లు అరిగిపోయిన దానితోనే బ్రష్ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం ఏర్పడి దంతాలు వదులుగా మారి పోతాయి.
రోజులో ఎక్కువ సార్లు కాకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే బ్రష్ చేయాలి. అదే విధంగా దంతాలు పై వైపు మాత్రమే కాకుండా లోపల వైపు సూక్ష్మ జీవులు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక లోపలి భాగంలో బ్రష్ చేయడం ఎంతో అవసరం. బ్రష్ చేసేటప్పుడు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దంతాలను రక్షించుకోవచ్చు.






























