Lavanya Tripati: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడమే కాకుండా మెగా ఇంటి కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటి లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడిన ఈమె రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ గత ఏడాది తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లావణ్య త్రిపాటి సినిమాలలో నటిస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇటీవల ఈమె కాలికి ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఇంట్లోనే గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే అభిమానులతో కలిసి సరదాగా చిట్ చాట్ చేశారు. అయితే ఒక నెటిజన్ మాత్రం ఈమెను ప్రశ్నిస్తూ మీరంటే నాకు చాలా ఇష్టం ఈ జన్మలో మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేకపోయాను వచ్చే జన్మలో అయినా మనం పెళ్లి చేసుకుందామా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లావణ్య చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఎన్ని జన్మలెత్తిన..
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు అలాగే ఈ జన్మలో మాత్రమే కాదు నేను ఎన్ని జన్మలెత్తినా నాకు వరుణ్ తేజ్ మాత్రమే భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంటూ తన భర్త పై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఈమె చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.



























