గత 5 నెలల నుండి భారత్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.! సామాన్య ప్రజల దగ్గర నుండి సినీ ప్రముఖుల వరకూ కరోనా వైరస్ ప్రస్తుతం ఎవర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతుంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడే అందిన సమాచారం మేరకూ ఈ కరోనా భాధితుల జాబితాలోకి మన మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ టాలీవుడ్ లో కూడా చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్, రాజమౌళితో సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు. టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం కూడా నెల రోజుల తర్వాత కరోనా నెగిటివ్ తెచ్చుకున్నారు. తాజాగా మెగాస్టార్ సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా దగ్గు, జర్వం లక్షణాలతో బాధపడుతున్న ఆయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది.

నాగబాబు ఓ ప్రముఖ ఛానల్‌ లో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆ షోలో పాల్గొన్నవారితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ షాకయ్యారంట. ప్రస్తుతం నాగబాబుతో పాటు మరికొందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై నాగబాబు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కరోనా భూతం మరెంతమందికి సోకుతుందో.. దీనికి అంతమెప్పుడో..? ఏదేమైనా మన జాగ్రత్తలో మనముండటం చాలా బెటర్ అని ఇప్పటికైనా తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here