మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె యాంకర్ గా, హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా నిహారిక గత ఏడాది జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.వివాహం తర్వాత తన భర్తకు ఈమె సినిమాలలో నటించడం ఇష్టం లేకపోవడం వల్ల ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారారు.

ఈ క్రమంలోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ నిర్మించి నిర్మాతగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ 9 వ తేదీ వారి మొదటి వివాహ వార్షికోత్సవం కావడంతో ఈ జంట స్పెయిన్ వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఇక తన భర్త చైతన్యతో కలిసి స్పెయిన్ లో ఎంతో సరదాగా గడుపుతూ షాపింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా నిహారిక స్పెయిన్ లో స్కై డైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మొదట్లో కాస్త భయంగా టెన్షన్ గా కనిపించిన నిహారిక స్కై డైవింగ్ ఎంతో ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ స్కై డైవింగ్ పూర్తయిన తర్వాత స్కై డైవింగ్ ఎలా ఉంది అని అక్కడ సిబ్బంది అడగడంతో చాలా బాగుందని చెప్పారు. మీకు నచ్చిందా? అని అడగడంతో చనిపోతానేమో అని అనుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























