Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా నిలిచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కేవలం తనే కాకుండా తన సోదరులను, వారసులను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దీంతో చిరంజీవి హోదాతో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవర్ స్టార్ గా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ కూడా అటువంటి గుర్తింపే సంపాదించుకున్నాడు.

అయితే ఇదంతా పక్కన.. తాజాగా చిరంజీవి ఓ రియాలిటీ షోలో పాల్గొని తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం పాప్ సింగర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అనే టాక్ షోలో హోస్టుగా చేస్తుంది. ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమోస్ కూడా విడుదలయ్యాయి.
అయితే ఫస్ట్ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చి పలు విషయాలు పంచుకున్నాడు. ఇక చిరంజీవి.. పవన్ గురించి ఒక విషయాన్ని తెలిపాడు. ఎవరికైనా ఏదైనా బాధ ఉందంటే వెంటనే స్పందించే తీరు, ఏదో చేయాలన్న తపన పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి ఉందని తెలిపాడు. ఒకానొక సమయంలో పవన్ నక్సల్స్ లోకి వెళ్లి పోతాడేమో అన్న భయం కూడా వచ్చిందని అన్నాడు.

Megastar Chiranjeevi:
ఇక స్మిత.. పవన్ రాజకీయ నాయకుడిగా లేదంటే సినీ నటుడిగా ఎలా ఉంటే మీకు ఇష్టం అని ప్రశ్నించడంతో.. వెంటనే చిరంజీవి.. పవన్ నేచర్ ను బట్టి అయితే అతను ఏదో ఒక రోజు కచ్చితంగా బలమైన రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడని అన్నాడు. ఇక పవన్ ప్రస్తుతం సినిమాలతో పాటు.. రాజకీయపరంగా కూడా బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే




























