Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మీడియాకు చాలా దూరంగానే ఉంటున్నారు. సందర్భం వస్తే కానీ.. మీడియాతో పెద్దగా మాట్లాడటం లేదు. అది కూడా తాను చెప్పాల్సింది మాత్రమే చెబుతున్నారు తప్పితే.. మీడియా అడిగే కొన్ని ప్రశ్నలను దాటవేస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం మీడియా పట్ల కాస్త కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ఓ ట్రెండ్ టాపిక్ ట్విటర్ లోకి తీసుకువచ్చి, ఆ మాటకు ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి డిజిటల్ మాధ్యమాల్లో ట్రోల్ చేయిస్తున్నారు. గతంలో కూడా మీడియా వాళ్లకు మనం టార్గెట్ కాకూడదని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.

అయితే ఈ మధ్య సెలబ్రెటీలు మీడియా టార్గెట్ అవుతున్నారు. సహజంగా సెటబ్రెటీల వివాదాలు, జీవితంపై సాాధారణ ప్రజలకు ఆసక్తి ఉంటుంది. అందుకే ఎప్పడు సెలబ్రెటీ వార్తలు వచ్చినా.. రీడర్లను, వ్యూయర్లను ఆకట్టుకుంటూ ఉంటాయి. దీంతో చాలా మీడియా సంస్థలు వారిపై స్టోరీలు చేయడం.. కాంట్రవర్సీ న్యూస్ లను ఎపిసోడ్లకు ఎపిపోడ్లు రన్ చేయడం చూస్తూనే ఉన్నాం.
ఈ మధ్య సెలబ్రెటీలు దూరంగా ఉంటూ..
దీంతో ఈ మధ్య సెలబ్రెటీలు దూరంగానే ఉంటున్నారు మీడియాకు. కనీసం స్టూడియోలకు వచ్చి తమ అభిప్రాయాలు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఏ మాట మాట్లాడితే ఏ తంటా వస్తుందో అని చివరకు మీడియాకు మొహం చూపించడం లేదు. చివరకు సోషల్ మీడియాలో వచ్చే చిన్న లీక్ ఆధారంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పుంఖాను పుంఖాలు వార్తలు రాసేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే చిరంజీవి వంటి పెద్దల మనసును కలవరపెడుతోంది. అలా అని పూర్తిగా మీడియాను ఆయన దూరం పెట్టలేరు. ఒకవేళ ఎవరినైనా పిలిపించి మాట్లాడితే ఆ ఒక్క సందర్భంలో చెప్పిన ఆయన మాట్లాడిన మంచి మాటలను వదిలేసి.. కాంట్రవర్సీలను వెతుకుతున్నారు.
































