తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శం, స్పూర్తి మెగస్టార్ చిరంజీవి. అతడు ఈ స్థాయికి చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మేము ఏవైతే విలువలు పాటిస్తున్నామో అవన్నీ మాకు చిరంజీవి నుంచి వచ్చినవే అని ఎన్నో సార్లు మెగా హీరోలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు.

ఆయన కొన్ని సినిమాల్లో ఎవరికీ చెప్పలేని కష్టాలను ఎదుర్కొన్నాడు. అలా ఓ సినిమాలో చిరంజీవి ఇబ్బంది పడ్డ విషయాలను చిరంజీవితో కలసి నటించిన తులసి శివమణి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆమె ఏం చెప్పారంటే.. చిరంజీవి కెరీర్ మొదట్లో ఆయనకు మంచి పేరును తీసుకొచ్చిన సినిమా ‘కోతల రాయుడు’.

ఈ సినిమా శ్రీ చిరిత చిత్ర నిర్మాణ సంస్థలో తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మాతగా కే. వాసు దర్శకత్వంలో రూపొందింది. ఇందులో చిరంజీవి గ్రే షేడ్ నటించారు. ఇక ఈ సినిమాలో తులసి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు అతడు షూటింగ్ కు లేట్ గా వచ్చాడు. దానికి ఆ సినిమా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కు కోపం వచ్చింది. దానికి అతడు ఇచ్చిన పనిష్ మెంట్ ఎంటో తెలుసా.. రోజంతా ఎండలో నిలబడమన్నారట.
దానికి చిరంజీవి ఏ మాత్రం సహనం కోల్పోకుండా.. తన వైపే తప్పు ఉందని దానిని స్వీకరించారు. ఈ విషయాన్ని విన్న తులసి షాకయ్యారని ఆమె తెలిపారు. ఇలా అతడు తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ రోజు షూటింగ్ లో పాల్గొనకుండా.. ఇంటికి వెళ్లి మరుసటి రోజు షూటింగ్ కు హాజరయ్యాడని చెప్పారు. ఇక ఆ ఘటనను అతడు ఏ రోజు మనసులో పెట్టుకోలేదంటూ చెప్పారు. ఇలా ఆమె ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు.































