రీసెంట్ గా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరంజీవి వాస్తు వస్తూనే తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకునేందుకు ట్విట్టర్ లో అడుగుపెడుతున్నా అని చెప్పారు. ఆ మాట నిజం చేస్తూ ప్రతి రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు మెగాస్టార్. అంతేకాదు సమాజంలో జరుగుతున్న సంఘటనలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తున్నారు చిరు.

తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో షేర్ చేసారు. 80లలో హీరో, హీరోయిన్లు రి-యూనియన్ పేరుతొ కలుసుకుంటూ ఉంటారు. ఏడాదికి ఒకసారి ఇలా కలుసుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఆ సందర్భంగా హీరోలు, హీరోయిన్లు తమ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజగా చిరుకూడా గత ఏడాది 80లలో కలిసిన వేళ, అప్పటి సూపర్ హిట్ హీరోయిన్లు సుహాసిని, రాధ, జయప్రధలతో అలనాటి పాటలకు డాన్స్ చేసారు. ఆ మూమెంట్స్ ను చిరు తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

































