Pushpha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకులను సందడి చేస్తోందని చెప్పవచ్చు.దక్షిణాది రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది కనుక ఇక్కడ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

కానీ ఉత్తరాది రాష్ట్రాలలో పుష్ప సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో ప్రతి ఒక్కరు పుష్ప రాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.హిందీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లను క్రాస్ చేసింది అంటే ఈ సినిమాకి ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లుఅర్జున్ డైలాగ్స్, మేనరిజమ్స్ మీమ్స్ క్రియేటర్ లకు చాలా పని చెప్పాయని చెప్పవచ్చు.

పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే ఏకంగా భారత ప్రభుత్వమే ఇతని సినిమాలోకొన్ని ఫోటోలను ఉపయోగించుకొని మాస్క్ పెట్టుకోవడం వల్ల ప్రాధాన్యత ఏమిటి హెల్మెట్ ధరించడం వల్ల ప్రయోజనాలు గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో చాలామంది పుష్ప స్టైల్లో మీమ్స్, వీడియోస్ క్రియేట్ చేసే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వైరల్ గా మారిన వీడియోస్..
ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కేవలం హిందీలోనే కాకుండా గుజరాత్ లో కూడా పుష్ప మేనరిజం చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. గుజరాత్ లో ఏకంగా ప్రో కబడ్డీ టీమ్ కూడా పుష్ప రాజ్ ను లిమిటెడ్ చేసిందనే చెప్పాలి. పుష్ప సైడ్ ఎఫెక్ట్ కొదువులేదని చెప్పాలి. ఇలా పుష్ప వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hamare #Giants flower nahi, fire hai! ????#GarjegaGujarat #GujaratGiants #Adani #vivoProKabaddi #CHEvGG #Pushpa @alluarjunonline pic.twitter.com/0TbuEnOkHD
— Gujarat Giants (@GujaratGiants) January 20, 2022
Side effects of Pushpa ????????????????????#Pushpa#PushpaHindi #AlaVaikunthapurramuloo #PushpaTheRule #PushpaTheRise pic.twitter.com/39BkPVNidV
— Allu Arjun Hindi FC ❤️ (@aaHindiFC) January 13, 2022































