Mita Vashisht: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క రంగంలో ఉంటాయి కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రం తాము ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని బహిరంగంగా తెలియజేస్తున్నారు.

ఇప్పటికే ఎంతోమంది సినీ హీరోయిన్లు ఇండస్ట్రీలో పలానా దర్శకుల నుంచి తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామని వెల్లడించారు. అయితే తాజాగా నటి మితా వశిష్ట్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఎదుర్కొన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ డైరెక్టర్ పేరు ప్రస్తావించకుండా.. ఒక టాలీవుడ్ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి చెన్నైలో కలిసారని తెలిపారు. ఆయన ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడటం లేదు. కానీ నాకు తెలుగులో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పిన ఆయన ఈ అవకాశం కావాలి అంటే రెండు నెలల పాటు నాతో ఉండాలని చెప్పారు.
రెండు నెలలు గడపాలి…
బహుశా లాంగ్వేజ్ ప్రాబ్లం కావడంతో భాష కోసమే రెండు నెలల పాటు తనతో ట్రావెల్ చేయాలని చెప్పారేమో అనుకున్న కానీ ఆయన తనతో గడపాలి అంటూ క్లారిటీగా చెప్పడంతో నేను సెకండ్ ఛాయిస్ తీసుకోలేదని ప్రధాన పాత్ర అయినప్పటికీ తాను డైరక్టర్ ప్రపోజల్ ని ఇష్టపడకపోవడంతో నేను తప్పుకున్నాననీ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
































