Balakrishna: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడి మొదలైంది మరి కొద్ది రోజులలో నామినేషన్ ప్రక్రియ కూడా మొదలుకానున్న తరుణంలో అన్ని ప్రాంతాలలోనూ అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో గత రెండుసార్లు జరిగిన ఎన్నికలలో భాగంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసి గెలుపొందిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మరోసారి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.. అయితే మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభించి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నేటి నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలోనే కదిరికి హెలికాప్టర్ లో వచ్చినటువంటి ఈయన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు.
ఇలా హెలికాప్టర్ దిగి బాలయ్య రాగానే ఒకసారిగా అభిమానుల చుట్టూ ముట్టారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని సెల్ఫీ కావాలంటూ బాలయ్య వద్దకు వెళ్లగా ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన బాలయ్య లాగిపెట్టి కొట్టారు. అంతేకాకుండా ఇతర అభిమానులపై కూడా ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్ఫీ అంటూ ఎగబడిన అభిమానులు..
ఇలా మొదటి రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలోని బాలకృష్ణ ఇలా అసహనానికి గురై అభిమానులపై చేయి చేసుకోవడం ప్రస్తుతం సంచలనగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గత రెండు సార్లు జరిగిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బాలయ్య ఈసారి కూడా గెలవడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. మరి ఈసారి కూడా బాలయ్య విజయ కేతనం ఎగరేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



























