BRS MLA : జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన తన నివాసంలో కాలు జారి పడ్డారు. ఈ రోజు ఉదయం స్నానం చేస్తుండగా బాత్రూంలో కాలు జారడంతో స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.

వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆయనను అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. కొన్ని కథనాల ప్రకారం ఈ సంఘటన కెసిఆర్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి అయిన గాయాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనమందరం ఆశిద్దాం. ఈ విషయంపై మరింత సమాచారం రాగానే మీకు తెలియజేస్తాము.





























