నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. 8 లక్షల మందికి ట్రైనింగ్..?

0
270

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల గతేడాది దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో డిగ్రీలు పూర్తి చేసి కొత్త ఉద్యోగాల కోసం వెతికే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనుంది.

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 స్కీమ్ లో మొత్తం 300 కోర్సులు అందుబాటులో ఉండగా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ద్వారా 8 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని భావిస్తోందని సమాచారం. 948 కోట్ల రూపాయలు మోదీ సర్కార్ ఈ స్కీమ్ అమలు కోసం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ అమలు ద్వారా యువత నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దేశంలోని 717 జిల్లాల్లో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేయనుంది.

https://pmkvyofficial.org వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిష్టర్ చేసుకుని ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ట్రైనింగ్ సర్టిఫికెట్ అందుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ మూడో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువత ఈ స్కీమ్ ద్వారా వొకేషనల్ ట్రైనింగ్ ను పొందవచ్చు.

యువత ఈ స్కీమ్ సహాయంతో నచ్చిన రంగంలో ఉపాధి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. గతంలో కూడా మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ అమలు ద్వారా భారీగా ప్రయోజనం చేకూరిన సంగతి తెలిసిందే.