కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు చేసారు కాంగెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజలందరూ కరోనా తో అల్లాడిపోతుంటే.. వారికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ల గురించి ఆలోచించడం మానేసి ట్విట్టర్ బ్లూటిక్ ల కోసం మోదీ ప్రభుత్వం పోరాడుతుంది అంటూ ఎద్దేవాచేశారు రాహుల్ గాంధి.

ఈ మేరకు ఆయన హిందీలో ఆదివారం ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం బ్లూటిక్ కోసం పోరాటం చేస్తోంది. మీకు కరోనా వ్యాక్సిన్ కావాలంటే మీ సంగతి మీరే మీరే చేసుకోవాలి అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు ఆరెస్సెస్ చీప్ వ్యక్తిగత ఖాతాలకు ట్విటర్ వెరిఫైడ్ బ్లూటిక్ తొలగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ब्लू टिक के लिए मोदी सरकार लड़ रही है-
— Rahul Gandhi (@RahulGandhi) June 6, 2021
कोविड टीका चाहिए तो आत्मनिर्भर बनो!#Priorities


































