Mohan Babu: మంచు మనోజ్ విష్ణుమధ్య విభేదాలు ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా వీరిద్దరూ గొడవ పడినటువంటి వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వీరి మధ్య ఉన్న గొడవలు నిజమేనని అందరూ భావించారు. ఇలా వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

ఇకపోతే ఈ వీడియో పై తాజాగా విష్ణు స్పందిస్తూ చేసినటువంటి ట్వీట్ అందరినీ కాస్త అయోమయానికి గురి చేసింది. మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఒక రియాలిటీ షోలో భాగంగానే ఈ వీడియో అంటూ పరోక్షంగా ఇద్దరు గొడవపడినటువంటి వీడియో గురించి విష్ణు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త అభిమానులను అయోమయానికి గురిచేస్తుంది.
తాజాగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు మనోజ్ మధ్య గొడవ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ విధంగా అన్నదమ్ముల గొడవ గురించి ఈయన ప్రస్తావిస్తూ భారతం గురించి తెలిపారు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పాటి అపర్తలేచిరిగి చిరిగి గాలి వానలా మారుతూ ఉంటాయని గొడవలు వల్ల ఏమీ రాదు చివరికి అన్ని కోల్పోతామని తెలిపారు.

Mohan Babu:గొడవపడితే ఆనందాలను కోల్పోతాం….
నిజజీవితంలో కూడా అంతే ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు పడిన చివరికి ఏం రాదు మనం గడుపుతున్న ఆనందక్షనాలు కోల్పోవడం తప్ప. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి ఎందుకు జరిగాయా అని ఆలోచిస్తూ ఉంటాను.. జరగకపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం సర్వసాధారణం అయితే అవి ఎంత కాలం ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే సమాధానం చెప్పలేనని ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































