Connect with us

Featured

Mokshagna: కుక్కలు అరుస్తుంటాయ్… కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!

Published

on

Mokshagna: విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా బాలకృష్ణ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైసిపి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా తన తండ్రి గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రంగంలోకి నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి పై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఈ సందర్భంగా మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాలయ్య గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కుక్కలు మొరుగుతున్నాయి మీరు ఎంత అరిచిన కనీసం బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు. ఒకప్పుడు అవసరముండి ఆయన కాళ్ల వద్దకు వచ్చిన వారందరూ అవసరం తీరిపోయాక ఆయనపై కారు కూతలు కూస్తున్నారు. ఇలాంటి కారు కూతలు కూసే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mokshagna: భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు..

ఇలా ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఒకవైపు వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇవ్వగా తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున వైసిపి నేతలపై మండిపడుతున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Featured

Supritha: తప్పకుండా మా అమ్మకు రెండో పెళ్లి చేస్తాను.. సుప్రీత కామెంట్స్ వైరల్!

Published

on

Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఈమె ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి కాస్త సినిమాలను తగ్గించారనే చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైన ఈమె తన కుమార్తెతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.

Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!
Supritha: నాన్నకు తలకొరివి నేనే పెట్టా… అమ్మకు రెండో పెళ్లి చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన సుప్రీత!

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సురేఖ వాణి గురించి తరచూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈమె త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 2019వ సంవత్సరంలో సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించారు అప్పటినుంచి తన కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు.

ఇలా కూతురితో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను గతంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఖండించేశారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సురేఖ వాణి కుమార్తె సుప్రీత మరోసారి తన తల్లి రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.

Advertisement

మంచి అంకుల్ దొరికితే..
ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ తన తల్లికి రెండో పెళ్లి చేస్తానని తెలిపారు. అయితే అమ్మకు అబ్బాయిలు సరిపోరని అంకుల్స్ అయితే సరిపోతారని ఈమె తెలిపారు తనని మంచిగా చూసుకునే అంకుల్ కనుక దొరికితే తనకు రెండో పెళ్లి చేస్తాను అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Published

on

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

Advertisement

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!