Mokshagna: నందమూరి కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదని వార్తలు రావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ తర్వాత అవి రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.

ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ శుభ తరుణం రానే వచ్చింది. త్వరలోనే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయం గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా కూడా ఈ వార్తలలో నిజం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.
సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞను ఇండస్ట్రీలో లాంచ్ చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేని సినిమాతో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తయిన తర్వాత బాలయ్యతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలోని తండ్రి కొడుకులిద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నట్లు సమాచారం.

Mokshagna: బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ…
సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ కనిపిస్తారట. ఆ సినిమాలో మోక్షజ్ఞ గెస్ట్ రోల్‌లో కనిపించినప్పటికీ.. అది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి వార్తలు వినిపించడంతో నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞని హీరోగా వెండితెరపై చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా ఒకే స్క్రీన్ మీద బాలయ్య, మోక్షజ్ఞని కలిసి చూసే తరుణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.


































