ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా విజృంభణ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో పోలిస్తే ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫస్ట్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయలేని వాళ్లు సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించిన సమయంలో పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోగా లాక్ డౌన్ అనంతరం డిమాండ్ భారీగా పెరిగింది.

దేశంలో పెట్రోల్, డీజిల్ దిగుమతులు అంతకంతకూ పెరగడంతో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర 87 రూపాయలకు చేరగా డీజిల్ ధర 80 రూపాయలుగా ఉంది. దేశంలోని ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రెండేళ్ల గరిష్ట స్థాయిని చేరడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ఇప్పటికే మన దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని 2021లో లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు, లీటర్ డీజిల్ 90 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా సైతం పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ లపై ధరలు అంతకంతకూ పెంచుతుండటంతో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2021లో వాహనదారులకు మరింత పెట్రోల్, డీజిల్ భారం తప్పకపోవచ్చని తెలుస్తోంది.































