సాధారణంగా ఎక్కడైనా తల్లి అంటే పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నిండాలని ఆలోచిస్తోంది. కన్నబిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకోవడంతో పాటు పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తల్లి భావిస్తుంది. అయితే ఒక మహిళ మాత్రం కన్న కూతురు వేళ్లను కొరుక్కుని తింది. కన్న కూతురుతో అంత దారుణంగా ప్రవర్తిస్తోందంటే ఆ తల్లి ఎంతటి క్రూరురాలో సులభంగా అర్థమవుతుంది. కానీ ఆ మహిళ మాత్రం కూతురు వేళ్లను సరదా కోసం తిన్నట్టు నటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాన్సాస్ లో ఒక మహిళ తన కూతురుతో కలిసి నివశించేది. కూతురు జోషఫైన్ చార్లీని సరదాగా ఆట పట్టించాలని భావించిన ఆ తల్లి వేళ్లను నోట్లో పెట్టుకుని నిజంగానే కొరుక్కుని తిన్నట్టు నటించింది. ఏమీ తెలియని అమాయకురాలైన పాప నిజంగానే తల్లి చేతివేళ్లను కొరుక్కును తినిందని భావించి ఏడుపు పెట్టింది. తల్లి ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తల్లి కూతురు చేతి వేళ్లను తిన్నట్టు నటించిన ఆ తల్లి ఆ వీడియోకు చేతి వేళ్లు తిన్నందుకు తన కూతురుకు కోపంగా ఉందని క్యాప్షన్ ను జోడించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నిన్న ఈ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు జోడిస్తున్నారు. ఆ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం తల్లి పిల్లను అంతలా ఏడిపించడం ఏంటని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఆ కాలానికి ఈ కాలానికి పిల్లల్లో, తల్లుల్లో చాలా మార్పు వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.































