Mr.Bachchan: మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఎ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు.

ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడంతో కొంతమంది సినీ పెద్దల కోసం ఈ సినిమాని ప్రత్యేకంగా వేశారట. ఇక ఈ సినిమా చూసిన సినీ పెద్దలు ఈ సినిమాపై వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని వస్తే.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా సాగిపోతుందని తెలుస్తోంది.
మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ ను చూపిస్తారట. ఓ పెళ్లి చూపులు.. అక్కడ జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ హైలెట్ గా ఉండనుందని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో సొంతూరికి రావడం అక్కడ స్నేహితులతో సరదాగా సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సెకండ్ హాఫ్ తర్వాత కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుందని తెలుస్తోంది.
యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్…
సెకండాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయట. డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తాయట. సాంగ్స్ వినడానికే కాదు.. చూట్టానికి కూడా అద్భుతంగా ఉన్నాయని ఈ సినిమాలో విజువల్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా రవితేజ పక్కా హిట్ అందుకోబోతున్నారని సినీ పెద్దలు ఈ సినిమా రివ్యూ వెల్లడించారు. ఇక ఇప్పటికే హరీష్ రవితేజ కాంబినేషన్లో షాక్ మిరపకాయ్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.



























