ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. కేంద్రమంత్రులను కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఆయన ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్ కోర్టులో బస చేశారు. అయితే ఆదివారం ఉదయం స్నానాలగదిలో వెళ్ళి అక్కడే పడిపోయారు. దీంతో ఆయన కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కాలుకు చికిత్స అందిచారు. ఆస్పత్రిలో ఉన్న మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు.

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడిక్కాయి. దళితవాదంతో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్ దళిత బంధు పతకం.. బహుజనవాదంతో మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరిక… ఇలా దళితల చూట్టే తెలంగాణలో రాజకీయాలు తిరుగుతున్నాయి.































